Flipkart

Flipkart

Pages

Thursday, January 16, 2014

Tagged Under: , , , , ,

A post related to Behavioral change

By: Unknown On: 1:19 AM
  • Share The Gag
  • ఒక అలవాటును ఎలా మానాలి... ఒక మంచి అలవాటును ఎలా ఏర్పరచు కోవాలి...(How to change our habits)

    మండలం రోజుల దీక్ష గురించి:

    మండలం అంటే 40 రోజులు.... మనం 40 రోజులు ఏ పని ఆచరించిన మన శరీరం, మనసు దానికి అలవాటు 

    పడిపోతుంది... ఈ అలవాటును మనం ఒక దీక్ష లాగ చేపడితే మనకు ఇంకా బాగా గుర్తు ఉంటుంది... 

    భగవంతుని దగ్గర మనం తీసుకునే దీక్షలు .. భగవంతుని సాక్షిగా అమలు చేయటం వలన... మనకు నైతికంగా/

    ఆధ్యాత్మికంగా బాధ్యత ముడి పడి ఉంటుంది... మనం ఏ దీక్షను చేప్పట్టిన కేవలం ఆ 40 రోజులు మాత్రమె 

    కాకుండా... జీవితం మొత్తం అనుసరించ గలిగితే... ఆ దీక్షకు సాఫల్యం సాధించినట్లే... ఎందుకంటే మన శరీరం 

    మన మనసు దానికి అలవాటు పడిపోతుంది...


    పండుగలతో దీక్షలను ప్రారంభించటానికి గల కారణం.... పండుగలను ఇంకా బాగా గుర్తుంచుకునే దానికే ... ప్రతి 


    పండుగకు ఒక కొత్త నిర్ణయం / దీక్షను తీసుకోవటం చేయాలి..... ఈ నిర్ణయం మన జీవితాన్ని ప్రభావితం 

    చేసేదిగా ఉండాలి... ఉదాహరణకు మాంసాహరాన్ని వదిలేయటం, వక్కపొడి, గుట్కా, మద్యపానం, సిగరెట్, 

    లాంటి వ్యసనాలు మాత్రమే కాదు...., రోజూ కొంత సేపు నడక/వ్యాయామం, పుస్తక పటనం, నెలకు 2000 

    రూపాయలు ఆదా చేయటం లాంటివి.... ఇవి మొదటిలో బాగానే ఉన్న... చిన్న.. చిన్నగా మానివేద్దాం 

    అనిపిస్తుంది... మనకు ఫలానా పండుగ రోజునుండి మొదలు పెట్టాం.. ఎందుకు వదిలేయాలి అని చిన్నగా మనకే 

    కొంచెం కుతూహలంగా అనిపించి వదల కుండా దానినే అనుసరిస్తాం... 


    ఇలా ప్రతి పుట్టినరోజుకో... కొత్త సంవత్సరానికో... ఒక ముఖ్య మయిన పండుగకో ... ఒక నిర్ణయం తీసుకోండి.... 

    పకడ్బందీగా plan చేసుకోండి... అమలు చేయండి.... మధ్య మధ్యలో మనం ఎక్కడున్నామనేది సరి 

    చూసుకోండి... 


    ఇలా అలవాటు చేసుకుంటే... మనం 5 సంవత్సరాల తర్వాత... తిరిగి వెనుకకు చూసుకునే పని ఉండదు... 

    మనం ఎప్పుడూ 5 సంవత్సరాల తర్వాత ఉంటాం... అనగా ఈ రోజు మనం జీవిస్తున్న జీవితం 5 సంవత్సరాల 

    క్రితమే plan చేసుకున్నది అయి ఉంటుంది... మనం తీసుకునే నిర్ణయాలు (goals ).. తక్కువ వ్యవధి 

    ఉండాలి... చాల సులభంగా పూర్తీ అయ్యేవిధం గా ఉండాలి.. అపుడు మనమీద మనకు నమ్మకం 

    పెరుగుతుంది... ఇది ఆత్మా విశ్వాసాన్ని పెంచుతుంది.... 



    గెలవాలన్నతపన మనలో ఉండాలి గానీ ఓటమి మన దగ్గరకు కూడా రాలేదు...

    Be happy friends...