బీహార్ లోని 'దశరధ్ మాఝీ' అనే ఆతను పొలాల్లో కూలీపని చేసుకునే ఓ
మామూలు శ్రామికుడు. అత్రి, వాజిరంగ్ అనే రెండు ఊర్లమధ్య ఓ కొండ
ఉంది. ఏ పని ఉన్నా ఈ ఊరివాళ్ళు ఆ ఊరికి వెళ్ళాలన్నా ఆ ఊరి వాళ్ళు
ఈ ఊరికి వెళ్ళాలన్నా 50 చుట్టూ తిరిగి మైళ్ళు వెళ్ళాల్సి వచ్చేది. ఆ ఊరి
జనాలకు ఇబ్బందిగా ఉండడమే కాకుండా దశరథ్ భార్య కూడా చాలా
ఇబ్బంది పడటం చూసి... 1959 లో దశరథ్ ఓ నిర్ణయానికి వచ్చాడు.
ఏమిటి? ఆ కొండను రెండు ముక్కలు చేయాలని! కాని సాధ్యమా.... రోజూ
పనిలోకి వెళ్ళడానికి ముందు, పని అయిన తర్వాత ఉదయం, సాయంత్ర
సుత్తితో ఆ కొండను బద్దలు కొడుతూనే ఉన్నాడు. ఓర్పు, శ్రమ, సహనం,
ఆత్మ విశ్వాసం, ధైర్యం మనోబలం లాంటివాటిని ఆయుధాలుగా
చేసుకున్నాడు.
దాదాపు 21 ఏళ్ళ పాటు అలా కష్టపడితే చివరికి 1980లో కొండ రెండుగా
చీలింది. 350 అడుగుల పొడువు, 16 అడుగుల వెడల్పు, 12 అడుగుల
ఎత్తుతో కొండ రోడ్డు తయారయింది. దాంతో చుట్టూ తిరిగి వెళ్ళే శ్రమ
లేకుండా 50 మైళ్ళు కలిసొచ్చింది.
అందుకే ఓ కవి అన్నాడు -'నాక్కొంచెం నమ్మకమివ్వు కొండల్ని పిండి
చేస్తాను'
ఏదో ఊరివాళ్ళ కోసం ఆతను అంత కష్టపడి మన కళ్ళదుటే ఇంతటి ఘన
విజయాన్ని సాధించారు కదా మరి మన కెరీర్ కోసం, మన కుటుంబం
కోసం ఎందుకు కష్టపడకూడదు. కష్టపడితే కొండలాంటి సమస్యలు విరిగి
పడవా? ఆలోచించండి.
(ఆకెళ్ళ రాఘవేంద్ర "సీక్రెట్ ఆఫ్ సక్సెస్" నుంచి)